Harsha Bhogle Picks His India Squad For T20 World Cup 2024

భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, ప…
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది. దక్షణాసియాలో ఏడు వేల కిలోమీటర్లకు పైగా సముద్రతీరము కలిగి ఉండి, భారత ఉపఖండములో అధిక భాగాన్ని కూడుకొని ఉన్న భారతదేశం, అనేక చారిత్రక వాణిజ్య రహదారులను కలిగి ఉంది. ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన అరేబియా సముద్రం, తూర్పున బంగాళాఖాతం ఎల్లలుగా ఉన్నాయి. పాకిస్తాన్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, ఆఫ్ఘానిస్తాన్ దేశాలతో సరిహద్దులను పంచుకుంటోంది. శ్రీలంక, మాల్దీవులు, ఇండోనేసియా భారతదేశం దగ్గరలో గల ద్వీప-దేశాలు. ఇది సింధు లోయ నాగరికతకు పుట్టిల్లు. హిందూ, బౌద్ధ, జైన, సిక్కు మతములకు జన్మనిచ్చింది. ఇది బహుభాషా, బహుళ జాతి సంఘము. ఇది వివిధ వన్యప్రాణుల వైవిధ్యం గల దేశం. జనాభాలో భారతదేశం 2023 ఏప్రిల్ లో చైనాను దాటేసింది.
  • రాజధాని: కొత్త ఢిల్లీ
  • అతిపెద్ద నగరం: ముంబై (నగరం సరైనది) · ఢిల్లీ (మెట్రోపాలిటన్ ప్రాంతం)
  • అధికార భాషలు: హిందీ · ఇంగ్లీషు
  • గుర్తించిన జాతీయ భాషలు: లేవు
  • స్థానిక భాషలు: 447 భాషలు
  • మతం (2011): 79.8% హిందూత్వం · 14.2% ఇస్లాం · 2.3% క్రైస్తవం · 1.7% సిక్కుమతం · 0.7% బౌద్ధమతం · 0.4% జైనిజం · 0.23% అనుబంధం లేని · 0.65% ఇతరులు · భారతదేశంలో మతం చూడండి
  • పిలుచువిధం: భారతీయులు
దీనిలోని డేటా: te.wikipedia.org